ప్రస్తుతం యావత్ ప్రపంచంలో క్రికెట్ విషయానికి వస్తే వెంటనే గుర్తొచ్చేది ఇండియానే. అందులో సందేహమే లేదని చెప్పాలి. ఈ దశాబ్దకాలంలో చూసుకుంటే క్రికెట్ లో మ్యాచ్ లు గెలవడం గాని, సెంచురీలు, ఏదైనా రికార్డులు మాత్రం భారత్ కే సొంతమని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దశాబ్దకాలానికి గాను జట్లను ప్రకటించింది. ఇందులో భారత్ మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కెప్టెన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆ గౌరవం ఏమిటంటే వాళ్ళ ప్రకటించిన జట్లలో వన్డే జట్టుకు ధోనిని, టెస్ట్ జట్టుకు కోహ్లిని కెప్టెన్లుగా ప్రకటించింది.
