ఈ రోజు రాయచోటిలో దాదాపు 2వేల కోట్ల రూపాయలకు శంకుస్ధాపన చేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టారు. మరలా ఇవాల ఆయన తనయుడు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయబోతున్నాడు, ఇంకో జన్మెత్తినా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేడు, మరో 20–25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు అంటూ వైయస్సార్ జిల్లా రాయచోటిలో మంత్రి అనిల్ ప్రశంగించారు.
మా నాయకుడు ఆరు నెలల్లో టెంకాయ కొట్టి అంతా నేనే చేశానని డప్పు కొట్టుకునే సీఎం కాదని కొద్దిరోజుల్లోనే ఎన్ని ఇబ్బందులున్నా ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమపథకాలను అమలుకు శ్రీకారం చుట్టిన మనసున్న నాయకుడు సీఎం వైయస్.జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.
అన్న ముఖ్యమంత్రి అయి ఆరు నెలలైంది. ప్రతీ ఒక్కరూ చూస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు కన్నా కూడా తండ్రిని మించిన తనయుడుగా ఇవాళ జగనన్న ఈ రాష్ట్రంలో తనదైన శైలిలో పరిపాలన చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాడు. కార్యదీక్షతో పోలవరం దగ్గర నుంచి, శ్రీకాకుళం వంశధార నుంచి, ప్రకాశం వెలుగొండ దగ్గర నుంచి రాయలసీమకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్ వరకు ప్రారంభించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదైతే ఆయన చనిపోయన తర్వాత పదేళ్లలో ఏ ఒక్కరికీ వీటిని పూర్తి చేయాలన్న ఆలోచన ,ఏ ఒక్క నాయకుడు చేయలేకపోతే ఈ రోజు ఆ భగవంతుడు సంకల్పంతో ఆ ప్రాజెక్టులు అన్నీ కూడా ఈ రోజు తన బిడ్డ ద్వారా ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే అవకాశం వచ్చిందని అనిల్ వ్యాఖ్యానించారు.