విశాఖపట్టణాన్ని నాశనం చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్న వ్యవస్థలను తమకు నచ్చలేదని మార్చడం తగదన్నారు. విశాఖపట్నానికి తాను ఎంతో అభివృధ్ది చేశానని ఆయన చెబుతూ, విశాఖలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సులు పెట్టి ఆ నగరానికి విశ్వ ఖ్యాతి తెచ్చానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీళ్లంతా అక్కడ చేరి ఆ నగరాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
రాజధాని గా చేస్తే విశాఖ నాశనం అవుతుందా? అంటూ వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ తో అన్ని ప్రాంతాలనూ అభివృధ్ది చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలందనరూ స్వాగతిస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం ప్రజలను తప్పుత్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.