హిట్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరీగా వీరిద్దరి కాంబినేషన్లో సరికొత్త మూవీ తెరకెక్కనున్న సంగతి విదితమే.
వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి మూడో తారీఖు నుండి ప్రారంభం కానున్నది. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహా,లెజెండ్ మూవీలు సూపర్ డూపర్ హిట్స్ కావడంతో తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటించనున్నాడు సమాచారం.