అనసూయ ఒక ప్రముఖ ఛానెళ్లల్లో వచ్చే ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాలతో తెలుగు అభిమానుల మదిని కొల్లగొట్టిన యాంకర్. ఒకవైపు వాక్ చాతుర్యంతో.. మరోవైపు అందంతో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ.
అయితే సేవా పన్ను కట్టకుండా ఉన్న సినీ తారల జాబితాలో ఈ ముద్దుగుమ్మ చేరింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై ఐదు లక్షలను సర్వీస్ ట్యాక్స్ ను ఎగ్గొట్టినట్లు జీఎస్టీ అధికారులు తెలిపారు.
మొత్తం రూ.80 లక్షల రూపాయల సేవా పన్ను చెల్లించాల్సి ఉండగా కేవలం 25లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అదనపు డైరెక్టర్ జనరల్ బాలాజీ మంజుందార్ తెలిపారు.
అనసూయ గతంలో రూ. 35 లక్షల సర్వీస్ ట్యాక్స్ బకాయి ఉన్నారు. సకాలంలో చెల్లించని కారణంగా వడ్డీ 15 లక్షల రూపాయలు పెరిగింది.