Home / CRIME / హైదరాబాద్ లో దారుణం.. కట్టుకున్న భార్యను..!

హైదరాబాద్ లో దారుణం.. కట్టుకున్న భార్యను..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో ఉప్పల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ లోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఎం శ్రీనివాస రావు,సుశీల దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు.

అయితే ప్రవేటు ఉద్యోగం చేశ్తున్న శ్రీనివాసరావు తరచుగా తన భార్యతో గొడవలకు దిగుతూ ఉండేవాడు. ఇందులో భాగంగా మంగళవారం కూడా గొడవ వాతావరణం చోటు చేసుకుంది.

ఈ గొడవలో భాగంగా భర్త శ్రీనివాసరావు రోకలి బండతో భార్య సుశీలను కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు సుశీల మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat