Home / ANDHRAPRADESH / చంద్రబాబు, పవన్ కల్యాణ్‌‌లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌‌లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానులు రావచ్చంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో ఒక వర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను చంద్రబాబు రెచ్చగొడుతూ ఆందోళన చేయిస్తుంటే..పవన్ కల్యాణ్ వారికి మద్దతు పలుకుతూ వివాదాన్ని మరింత రగిలిస్తున్నాడు. మూడు రాజధానులపై ఒక్క అమరావతి ప్రాంతం మినహా మిగతా రాష్ట్రమంతా మద్దతు పలుకుతుందని తెలిసినా…బాబు, పవన్‌లు ఆందోళనలు చేయిస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు వ్యవహరిస్తున్న తీరుపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. డిసెంబర్ 23 న నియోజకవర్గంలోని దామరమడుగు, రేబాల, జొన్నవాడ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పలు అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మూడు రాజధానుల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అసలు ఇద్దరు పిచ్చోళ్లతో అనర్థమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల అభిప్రాయాన్ని శాసనసభలో తెలిపారన్నారు. దీనిపై చంద్రబాబు, అతను ఇచ్చే సూట్‌కేసులకు అమ్ముడుపోయిన పవన్‌కల్యాణ్‌ రాజధాని ప్రజలను రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని మారితే అక్కడ ప్రజలు భూములను దోచుకున్న చంద్రబాబు అండ్‌ కో నేతలకు నష్టమని ఏవేవో మాట్లాడుతున్నారన్నారని ధ్వజమెత్తారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకున్నారని, వాటన్నింటిని అభివృద్ధి చేయాలనే సీఎం మూడు రాజధానులను ప్రకటించినట్లు నల్లపురెడ్డి వివరించారు. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో రాద్ధాంతం చేస్తున్న పార్టనర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల‌పై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat