రాంచరణ్, ఉపాసన జరుపుకున్న పార్టీ చాలా వైభవంగా జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, అఖిల్, రానా దగ్గుబాటి, శృతిహాసన్, సమంత మరియు తదితరులు పాల్గున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఒక విషయం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అదేమిటంటే ఈ ఫంక్షన్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాలేదు. ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య మంచి స్నేహం ఉంది. అలాంటి ఎందుకు రాలేదని అందరి మదిలో ఉన్న ప్రశ్న. మరోపక్క అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య ఏవేవో గొడవలు ఉన్నాయని వార్తలు కూడా ఉన్నాయి. కాని ఇవ్వన్ని పక్కన పెడితే అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ ఒక టీవీ షో లో నటించడం వల్ల కుదరలేదు. మరోపక్క అల్లు అర్జున్ అయితే తన సినిమా ఆఖరి గట్టానికి చేరుకోవడంతో రావడానికి కుదరలేదు.