Home / CRIME / అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చిన ఓ తల్లి..అక్రమ సంబంధాల్లో అత్యంత దారుణం ఇదే

అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చిన ఓ తల్లి..అక్రమ సంబంధాల్లో అత్యంత దారుణం ఇదే

మాతృత్వానికి ఆమె మచ్చ తెచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా కర్కషంగా వ్యవహరించింది. తన వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించి వికలాంగుడు అని కూడా కనికరం లేకుండా గొంతు నులిమి ఉసురు తీసింది. అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు తన కొడుకును చంపేశారని 100 నంబర్‌కు కాల్‌ చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. అందరి హృదయాలను కలచివేసే ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వినాయక్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న సుల్తానాబేగం(35)కు పదిహేనేళ్ల క్రితం కొత్తూరు మండలం జహంగీర్‌ పీర్‌ దర్గా వద్ద పూలు విక్రయించే ఓ హాజీతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్న సుల్తానాబేగం పుట్టిల్లు అయిన వినాయక్‌నగర్‌లో పిల్లలతో కలిసి ఉంటోంది. ఆమెకు తన వివాహానికి ముందే పరిచయం ఉన్న ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇస్మాయిల్‌తో సహజీవనం సాగిస్తోంది.

గుడిమల్కాపూర్‌లో నివాసం ఉంటున్న అతడు తరచూ సుల్తానాబేగం ఇంటికి వస్తుండేవాడు. ఆదివారం సాయంత్రం సుల్తానాబేగం తల్లిదండ్రులను తమ బంధువుల ఇంటికి పంపించి ఇస్మాయిల్‌తో కలిసి ఇంట్లో ఉంది. పోలియోతో బాధపడుతున్న ఆమె చిన్న కుమారుడు అంజత్‌(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. తమ వివాహేతర సంబంధానికి కొడుకు అంజద్‌ అడ్డుగా ఉన్నాడని భావించిన సుల్తానాబేగం ఆదివారం రాత్రి ఇస్మాయిల్‌తో కలిసి బాలుడి గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం సుల్తానాబేగం 100 నంబర్‌కు కాల్‌ చేసింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన కుమారుడిని చంపేశారని పోలీసులకు తెలిపింది. ఉన్నతాధికారుల సమాచారంతో ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్యగౌడ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇరుగుపొరుగు వారు ఘటనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు సుల్తానాబేగం, ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అంజద్‌ గొంతు నులిమి హత్య చేసినట్లు నేరం అంగీకరించారు. కుమారుడి మృతి చెందిన విషయాన్ని తెలుసున్న హజీ వినాయక్‌నగర్‌ చేరుకున్నాడు. మిగిలిన ఇద్దరు కొడుకులను కూడా సుల్తానాబేగం చంపేస్తుందని, వారిని తనకు అప్పగించాలని వేడుకున్నాడు. కుమారుడిని చంపేసి సుల్తానాబేగంను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బాలుడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat