Home / SLIDER / థర్డ్ పార్టీ క్వాలిటీ చెకింగ్ విధానం

థర్డ్ పార్టీ క్వాలిటీ చెకింగ్ విధానం

తెలంగాణలోమహిళలు, శిశువుల సంరక్షణ, అభివృద్ధి, సంక్షేమ కేంద్రాలుగా పనిచేస్తున్న అంగన్ వాడీలను జిల్లా కలెక్టర్లు తరచూ సందర్శించి సరిగా పనిచేసేలా పర్యవేక్షించేలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు కోరారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ అధికారికంగా లేఖలు రాయాలని కూడా నిర్ణయించారు. మహిళా-శిశు సంక్షేమ శాఖ పనితీరు, ఇటీవల వస్తున్న వివిధ వార్తల నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ నేడు శాఖ డైరెక్టరేట్ లో కార్యదర్శి జగదీశ్వర్, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

 
జనాభాలో సగం ఉన్న మహిళలు, అత్యంత శ్రద్ధ పెట్టాల్సిన శిశువులున్న ఈ శాఖలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకుతానీ, చర్యలకుగానీ తావివ్వకుండా అధికారులు, సిబ్బంది నిరంతరం జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. మనసు పెట్టి పనిచేయాల్సిన చోట అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యానికి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకూడదని, ఇలాంటివి జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉండాలని, నాణ్యత లోపించకుండా ఆహారాన్ని తల్లులు, బిడ్డలకు అందించాలన్నారు. అక్షయ పాత్ర, ఇతర సంస్థల ద్వారా పంపిణీ జరిగే ఆహారం కూడా చల్లబడకుండా, వేడివేడిగా వడ్డించేందుకు కావల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
అడవితల్లుల అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళ మేడారంలో మహిళా-శిశు సంక్షేమ శాఖ తనవంతు పాత్రను పోషించాలని, మహిళలు, శిశువులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రచారం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు.తెలంగాణ ఫుడ్స్ సంస్థలో కొత్త ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, వీలైనంత త్వరలో ఈ ప్లాంట్లను ప్రారంభించేందుకు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా ఆహార పదార్థాల నాణ్యతపై ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు థర్డ్ పార్టీ క్వాలిటీ చెకింగ్ విధానాన్ని అవలంభించాలన్నారు.
 
డైరెక్టరేట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పూర్తి స్థాయిలో హరితహారం కింద మొక్కలు నాటి గ్రీనరీ డైరెక్టరేట్ గా అభివృద్ధి చేయాలన్నారు.డైరెక్టరేట్ ముందు ఉన్న పరిసరాలను, గేటు వద్ద ఉన్న ఇబ్బందులను తనిఖీ చేశారు. మహిళలు, శిశువులు ఉండే ఈ డైరెక్టరేట్ ప్రాంతానికి భద్రత కట్టుదిట్టంగా ఉండాలని, ఇతరులు ఎవరూ కూడా అనుమతి లేకుండా లోనికి వెళ్లడానికి వీలు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని, నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డైరెక్టరేట్ పరిసరాల్లో చేపడుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించే విధంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat