ఏపీ లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి విశేష ఆదరణ లభిస్తోంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ చేసిన ఈ ఆలోచన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనడంలో సందేహంలేదు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇదివరకే స్వాగతిస్తున్నాం అని చెప్పడం జరిగింది. అయితే తాజాగా గంటా మాట్లాడుతూ వైజాగ్ లో రాజధాని కి అన్ని విదాల అనుగుణంగా ఉంటుందని అన్నారు. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారని, ఇక్కడ అంతా శాంతియుతంగా ఉంటుందని చెప్పారు. విశాఖ రాజధానికి అన్ని విదాల సరిపోతుందని జిఎన్ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నానని అన్నారు. ఇదంతా చూస్తుంటే గంటా వైసీపీకి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.