దేశ వ్యాప్తంగా రైల్వేలో ప్రయాణిస్తున్న వారికి ఇది బిగ్ షాక్. దేశ వ్యాప్తంగా రైల్వే ఛార్జీలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ఇందులో భాగమ్గా ఈ వారంలోనే ఈ పెంపు ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కిలోమీటర్ కు ఐదు పైసల నుండి నలబై పైసల వరకు టికెట్ ధర పెంపు ఉంటుందని ఆ వార్తల సారాంశం. రైల్వే ఛార్జీల పెంపుకు ప్రధాన మంత్రి కార్యాలయం గడిచిన నెలలోనే అనుమతి తెలిపింది.
అయితే జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో ఈ పెంపు ఆలస్యమైంది. అటు రవాణా ఛార్జీలను పెంచే పరిస్థితులు లేకపోవడంతో ప్రయాణికుల ఛార్జీల పెంపుకే రైల్వే శాఖ మొగ్గు చూపినట్లు సమాచారం.