తెలంగాణ రాష్ట్రంలో ఖానాపూర్, కడెం,పోనకల్ రైతాంగానికి వరప్రదాయనిగా మారనున్న సదర్ మాట్ బ్యారేజి నిర్మాణం పనులను సిఎంఓ కార్యదర్శి స్మీతా సబర్వాల్, అటవీ శాఖ మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యేలు అజ్మీర రేఖాశ్యాంనాయక్,విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంతిలు సందర్శించారు.
హెలిక్యాప్టర్ ద్వారా గగనతలంలో విహంగ విక్షణం ద్వారా ముందుగా పరిశీలించారు. ఉన్నతాదికారులతో బ్యారేజి నిర్మాణ పనులపై అడిగి తెలుసుకున్నారు.సదర్మాట్ బ్యారేజి నుండి సదర్ మాట్ వరకు నేరుగా కేనాల్ నిర్మించాడానికి సిఎం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆది సాద్యం కానీ పక్షంలో ఎల్లకాలం కాలువ ద్వారా 365 రోజులు 300 క్యూసేక్కుల నీటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ కోరారు.