అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు,ఎంపీ రాహుల్ గాంధీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఒకవైపు కృతజ్ఞతలు చెబుతూనే మరోవైపు ఘాటుగా రిప్లై ఇచ్చాడు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా జరుతున్న ‘ప్రజాందోళన’కు రాహుల్ మద్దతుగా నిలవడంపై పీకే హర్షం వ్యక్తం చేశారు.
అయితే ఇది మాత్రమే సరిపోదనీ.. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేయబోమంటూ ‘‘అధికారికం’’గా ప్రకటించాలని కూడా ఆయన రాహుల్‌ను కోరారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిన్న రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించిన నేపథ్యంలో పీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.