పాయల్ రాజ్ పూత్..టాలీవుడ్ లో ఈ పేరు వింటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది ఆరెక్ష్ 100 సినిమానే. ఈ చిత్రంతో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్ ఆ తరువాతి సినిమా విషయంలో చాలా పెద్ద పొరపాటు చేసింది. సీక్వెల్ లో రెండో సినిమా తీసి ఉన్న కాస్తా ఇమేజ్ పోగొట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే వెంకీ మామ షూటింగ్ లో ఉండడంతో సేఫ్ అయ్యిందని చెప్పాలి. ఎంత ఎలా ఉన్నా షూటింగ్ అనంతరం కూడా ఈ ముద్దుగుమ్మని పక్కన పెట్టేయడం జరిగింది. దాంతో బుద్ధి తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లైన్ లోకి వచ్చిందని అంటున్నారు. ఇకనైనా మంచి కధలు ఎంచుకొని నటిస్తే కెరీర్ బాగుంటుంది. లేదంటే అంతే సంగతులు మరి.