మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెట్టి వారి బంధువులు, భినామీల కోసం స్కెచ్ వేసారు. రాజధాని ఇంకా అన్నౌస్ చేయకముందే వారందరూ రైతులకు మాయమాటలు చెప్పి దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు. ఇదేమిటని చంద్రబాబుని అడిగినా పట్టించుకోని వైనం. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. “రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన బంధువులు, బినామీల భూముల ధరలు పెంచాలని చంద్రబాబు స్కెచ్ వేశాడు. అలా జరిగి ఉంటే వాటి విలువ 6-7 లక్షల కోట్లకు చేరేది. వికేంద్రీకరణతో ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని సామూహిక శోకాలు పెడుతున్నారు” అని అన్నారు.