త్వరలో రైల్వే చార్జీలు పెంచేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్న వేళ..అంతకు ముందే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహార పదార్థాల ధరలు పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 24 న ఇండియన్ రైల్వే స్టేషన్లలలోని ఫుడ్ సెంటర్లలో ఆహార ధరలను ఐఆర్‌సీటీ పెంచింది. దీంతో స్టాక్ ఎక్సేంజీలో ఐఆర్‌సీటీసీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో అందుబాటులోకి వస్తాయి. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఫుడ్ కేంద్రాల్లో ప్రామాణిక ఆహార ధరలను మార్చింది అని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. జనాహార్, రిఫ్రెష్‌మెంట్ రూమ్స్ వంటి వాటికి ఈ పెరిగిన రేట్లు వర్తిస్తాయి. మొత్తంగా రైల్వే చార్జీలకంటే ముందే రైల్వేస్టేషన్లలో ఆహార పదార్థాల ధరలను పెంచేసి ఐఆర్‌సీటీసీ సామాన్యుడికి జేబును కొల్లగొట్టింది.
సవరించిన ధరల ప్రకారం ఆహార పదార్థాల కొత్త రేట్లు ఇవే…
– వెజ్ బ్రేక్ ఫాస్ట్ – రూ.35
– నాన్ వెజ్ బ్రేక్ ఫాస్ట్ – రూ.45
– స్టాండర్డ్ వెజ్ మీల్ – రూ.70
– స్టాండర్డ్ మీల్ (ఎగ్ కర్రీ) – రూ.80
– స్టాండర్డ్ మీల్ (చికెన్ కర్రీ) – రూ.120
– వెజ్ బిర్యానీ (350 గ్రాములు) – రూ.70
– ఎగ్ బిర్యానీ (350 గ్రాములు) – రూ.80
– చికెన్ బిర్యానీ (350 గ్రాములు) – రూ.100
– స్నాక్ మీల్ (350 గ్రాములు) – రూ.50