ఓ అమ్మాయి ఫస్ట్ నైట్ రోజే మొగుడికి చుక్కలు చూపించింది. ఫస్ట్ నైట్ కాగానే భర్తకు అనుకోని షాక్ ఇచ్చేసింది. ఉత్తరాఖండ్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఛండీగడ్ కు చెందిన అబ్బాయికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన అమ్మాయికి పెళ్లి నిర్ణయించారు. ఇరు కుటుంబాలు బంధువులే.. రెండ్రోజుల క్రితం వారికి హరిద్వార్‌లోని ఓ హోటల్లో వారి పెళ్లి ధూంధాంగా జరిగింది. అట్టహాసంగా సంబరాలు నిర్వహించారు. అంతా బాగానే ఉంది.. ఆ తర్వాత అమ్మాయికి, అబ్బాయికి అదే హోటల్లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. బంధువులంతా అమ్మాయి అలంకరించి.. ఆట పట్టిస్తూ అబ్బాయి గదిలోకి పంపారు. ఆ తర్వాత ఎవరికి వారు నిద్రలో జారుకున్నారు. ఆ అమ్మాయి ఫస్ట్ నైట్ కూడా బాగానే ఎంజాయ్ చేసిందట. ఆ తర్వాత ఉదయాన్నే అబ్బాయికి మెలకువ వచ్చి చూస్తే.. పెళ్లి కూతుకు కనిపించలేదు. శోభనం రాత్రి విశేషాలు తెలుసుకుని.. వధువును ఆటపట్టిద్దామని పెళ్లి కొడుకు తరపు మహిళలు గుమ్మం దగ్గరే కాచుకున్నారు. కానీ..ఎంతకీ అమ్మాయి బయటకు వస్తే కదా.. అనుమానం వచ్చి తలుపుతీసి చూస్తే.. ఏముంది.. అబ్బాయి ఒక్కడే గోళ్లు గిల్లుకుంటూ కనిపించాడు. మరి అమ్మాయి ఏదిరా బాబూ.. అంటే.. ఇంకెక్కడ అమ్మాయి.. అంటూ భోరుమన్నాడు. దీంతో కలకలం రేగింది. అందరూ ఆమె కోసం హోటల్ మొత్తం గాలించారు. అప్పుడే తెలిసింది అసలు సిసలు షాక్.. అదేంటంటే.. పెళ్లికొడుకు గదిలో ఉండాల్సిన బంగారు నగలు, రూ.50వేల నగదు కనిపించలేదు. నగల విలువ దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయుల ఉండొచ్చట. ఆ తరవాత వాకబు చేస్తే.. పెళ్లికూతురుతో పాటు ఆమె సోదరుడు కూడా కనిపించలేదు. దాంతో లబోదిబోమంటూ పెళ్లికొడుకు తరపువారు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి సోదరుడుతో వధువు జంప్ వెనుక అసలు కథమేటో కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు.
