కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఓ సీన్ చూస్తే చంద్రబాబుకు చిర్రెత్తి పోవడం ఖాయం..సీఎం రమేష్ గుర్తున్నారుగా…ఒకప్పుడు బాబుగారికి అత్యంత ఆప్తుడు…ప్రధాన ఆర్థిక వనరు అయిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో చేరారులెండి.. ఏపీలో ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతో బెంబేలెత్తిన చంద్రబాబు మోదీకి మళ్లీ దగ్గర అయ్యేందుకు తన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించాడని టాక్..ఆ విషయం పక్కనపెడితే..బీజేపీలో చేరిన తర్వాత సుజనాచౌదరి ఇప్పటికీ చంద్రబాబు పాట పాడుతుంటే…సీఎం రమేష్ మాత్రం గత కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు. ఏదో తన వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. అసలు సీఎం రమేష్‌కు ఏమైంది..ఎందుకు కామ్‌గా ఉంటున్నాడు…ఎల్లోమీడియా ఛానళ్లు కూడా కథనాలు ప్రసారం చేశాయి. అయితే తాజాగా కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రమేష్ ప్రత్యక్షమయ్యాడు. డిసెంబర్ 23, సోమవారం నాడు ఉదయాన్నే ప్రొద్దుటూరు సమీపంలోని తన స్వగ్రామం నుంచి కారులో బయలుదేరిన సీఎం రమేష్ కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్నారు. ప్రత్యర్థి పార్టీ అయినా రాజ్యసభ సభ్యుడు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆయన్ని సాదరంగానే ఆహ్వానించారు. రమేష్ కూడా ఎలాంటి బేషజాలు లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలతో నవ్వుతూ పలకరిస్తూ ముచ్చట్లు పెట్టారు.
ఇక గతంలో సీఎం రమేష్ కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆరు రోజులపాటు నిరాహారదీక్ష చేశాడు గుర్తుందా..బాత్రూంలో కూర్చుని బిర్యానీలు లాగించాడని రమేష్ గారి తుక్కు దీక్షపై సారీ ఉక్కు దీక్షపై సెటైర్లు కూడా పడ్డాయి. ఆ ఉక్కు దీక్షను వైసీపీ నేతలు గుర్తు చేయడంతో రమేష్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఇంతలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సీఎం రమేష్ సైతం సీఎం జగన్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. రమేష్‌ను చూసి చిరునవ్వుతో పలకరించారు జగన్. ఎలా ఉన్నారన్నా.. అంతా బాగుండారా?..` అని కుశల ప్రశ్నలు వేశారు. దీంతో అదే చిరునవ్వుతో రమేష్ బదులిస్తూ.. మీరు నా ఉక్కు దీక్షను సఫలం చేయాలి. ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా కడప స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోలేదు. స్టీల్ ప్లాంట్ కోసం జిల్లావాసులు ఎదురు చూస్తున్నారు. మీరైనా వారి కలను నిజం చేయాలి..` అని రమేష్ సీఎం జగన్‌ను కోరారు. దీంతో తప్పకుండా జిల్లావాసుల కలను నెరవేరుస్తామని, మాట ఇచ్చిన తరువాత వెనుకంజ వేయబోననే విషయం మీకు తెలుసు కదా.. అని సీఎం జగన్ గుర్తు చేశారు. కడప ఉక్కు దీక్ష సందర్భంగా జరిగిన ఈ సీన్ చూసి చంద్రబాబు కుతకుతలాడిపోతున్నాడు.జగన్‌ను కలవడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం కూడా కడప స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోలేదన్న రమేష్ వ్యాఖ్యలపై బాబుగారు రగిలిపోతున్నాడు. పరోక్షంగా కడప ఉక్కు దీక్షను పట్టించుకోలేదని రమేష్ తనపైనే విమర్శలు చేయడం కాకుండా..అదీ సీఎం జగన్ ముందు చెప్పడంపై బాబుగారు తెగ ఫీలైపోతున్నారు. మొత్తంగా కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన ఈ సీన్ చంద్రబాబుకు నిజంగా చిర్రెత్తించిందనే చెప్పాలి.