డిసెంబర్ 25న ఏసుక్రీస్తు లోకకల్యాణార్థం ఈ భువి మీద అవతరించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే క్రిస్మస్ సంబురాలు షురూ అయ్యాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం.. ఇవన్నీ జీసస్ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత సందేశాలని సీఎం జగన్ అన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాకు అధికారికంగా ఓ ప్రకటన జారీ చేయడం జరిగింది.