తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో TTDC భవనంలో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని 3టౌన్ రైతు బజార్, హోల్ సేల్ మరియు రిటైల్ మార్కెట్ ల సమస్యలు, DRDA పక్కన ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, కాటన్ కొనుగోలు, సీసీఐ కొనుగోలు కేంద్రాల తనిఖి, రానున్న మిర్చి పంట ధర పడిపోకుండా చూడటం, వెర్ హోసింగ్ గోడౌన్ తదితర అంశాలు, పలు సమస్యలపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
సమీక్షలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ బాయి గారు, మేయర్ పాపాలాల్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ RV కర్ణన్ IAS గారు, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి IAS గారు, AMC చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారులు ఉన్నారు.