జార్ల్హండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్ర్తెస్,జేఎంఎం మిత్రపక్షం విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది.
ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటింది కాంగ్రెస్,జేఎంఎం కూటమి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏర్పాటుకు నలబై రెండు మంది సభ్యుల మద్ధతు అవసరం.
ఇప్పటి వరకు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి నలబై మూడు స్థానాల్లో అధిక్యంలో ఉంది. బీజేపీ 28,ఏజేఎస్ యూ4,జేవీఎం3,ఇతరులు నాలుగు స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి.
గత ఎన్నికల్లో ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ 42,జేఎంఎం 19,జేవీఎం8,కాంగ్రెస్ 6,ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపొందాయి.