ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. సీఎం జగన్ ప్రకటనపై పలువురు మద్ధతు తెలుపుతున్నారు. మరోవైపు టీడీపీ,జనసేన కు చెందిన నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా స్టార్ చిరంజీవి జగన్ నిర్ణయానికి మద్ధతు తెలిపారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసి తన మద్ధతు ప్రకటించారు. ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తుంటే మరోవైపు చిరు మద్ధతు తెలపడంతో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో చిరు మద్ధతుపై ఏపీ బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రమేష్ మీడియాతో మాట్లాడుతూ ‘చిరంజీవి మూడు రాజధానులు మంచిది అన్నారు. ఆయనకు రాష్ట్రంలో ఓటు హక్కు కూడా లేదు. విశాఖలో లాభాపేక్ష కోసమే చిరంజీవి.. జగన్‌కు వంత పాడుతున్నారు’ అని ఆరోపించారు.