తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని మేడ్చల్ మల్కాజీగిరి జిల్లాలో జగద్గిరిగుట్టలో నల్లగొండ జిల్లా ఆలేరు బొమ్మలూరుకు చెందిన మహేశ్వరి (28) జగద్గిరిగుట్టకు చెందిన వెంకటేష్ గౌడ్ తో పదేళ్ల కిందట వివాహాం జరిగింది.
కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతూ .. తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహేశ్వరి నిన్న శనివారం ఉదయం ఇంట్లో సీలింగ్ కు తన చీరతో ఉరి వేసుకుని ఆత్మహాత్య చేసుకుంది.
దీంతో ఆ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే మహేశ్వరి కుటుంబ సభ్యులు అత్తారింటి వేధింపులే ఆత్మహత్యకు కారణం అని ఆరోపిస్తున్నారు.