ఈ ఏడాదిలో ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తొమ్మిది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం.ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము.
మార్చి 9న అతిపెద్ద వయస్కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు పొందిన జపాన్ దేశస్తురాలు టనకా(116)
మార్చి10న ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-8 విమానం కూలి 157మంది దుర్మరణం
మార్చి 15న న్యూజిలాండ్ లో రెండు మసీదుల్లో జరిగిన కాల్పుల్లో నలబై తొమ్మిది మంది మృతి
మార్చి 26న మెక్సికో వెంబడి సరిహద్దు గొడ నిర్మాణానికి బిలియన్ డాలర్ల నిధుల బదిలీకి అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఆమోదం
