ఈ ఏడాదిలో ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తొమ్మిది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం.ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలలో జాతీయంగా చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము.
మార్చి5న ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ప్రారంభం
మార్చి7న దేశ కరెన్సీ వ్యవస్థలోకి రూ.20 నాణేం రాబోతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటన
మార్చి 8న అయోధ్య వివాదం పరిష్కారానికి మధ్యవర్తులను నియమించిన సుప్రీం కోర్టు
మార్చి10న పదిహేడవ లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్
మార్చి11న ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రదానం
మార్చి18న గోవా సీఎం గా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం
