ఈ రోజు ఆదివారం కటక్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలుపొంది టీమిండియా వెస్టిండీస్ జట్టుకు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఈ మ్యాచ్ ను చూడటానికి వచ్చేవారిని ఒక అభిమాని మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అతని పేరు పింటూ బెహెరా. బెహెరా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని.
ఈ అభిమానంతోనే బెహెరా తన శరీరంపై ఏకంగా 16 టాటూలు వేయించుకున్నాడు. దీనికోసం అక్షరాల లక్ష రూపాయలు ఖర్చుపెట్టాడు.ఈ సందర్భంగా బెహెరా మాట్లాడుతూ” నాకు కోహ్లీ స్టైల్ ఇష్టం. ఆయన ఆటతీరుకు నేను పెద్ద ఫ్యాన్. ఆయన పై ఉన్న అభిమానాన్ని ,గౌరవాన్ని ఇలా చూపిస్తానని అన్నాడు.
తాను సంపాదించిన డబ్బులో రూపాయి రూపాయి పోగేసి దీనికి ఖర్చు పెట్టాను .. గత అక్టోబర్ నెలలో విరాట్ ను కలిశాను అని చాలా సంతోషంగా చెప్పాడు బెహెరా.