గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు పాలన విషయానికి వస్తే మొత్తం శూన్యం అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా తన భాధ్యతను మర్చిపోయారో ఏమో తెలియదుగాని ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేకపోయారు. అంటే సాయం చెయ్యాల్సిన చేతులే మింగేసాయి అని చెప్పాలి. మరోపక్క అమరావతి విషయానికి వస్తే ఇదో పెద్ద స్కామ్ అని చెప్పడంలో సందేహమే లేదు. ప్లాన్ వేసుకొని ముందుగానే రైతుల దగ్గర భూములు లాక్కొని మోసం చేసారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చుక్కలు చూపించాడు. “అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని ఎంత సాగదీస్తే భూముల విలువలు అంత పెరుగుతాయనేది చంద్రబాబు స్కెచ్. అందుకే ఐదేళ్లలో నాలుగు తాత్కాలిక భవనాలు మినహా గ్రాఫిక్స్ తోనే కాలం వెళ్లబుచ్చాడు. ఇప్పడు ప్రపంచస్థాయి రాజధానిని తరలిస్తే ఎలా అని పెడబొబ్బలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు” అని అన్నారు.