2018 సంవత్సరం రిలీజైన సినిమాలకు గాను 66వ ఫిలింఫేర్ ఉత్సవాలు చెన్నై వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ పురస్కారాల్ని సౌత్ కు సంబంధించిన నాలుగు భాషల చిత్రాల వారికి అందజేస్తారు. ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ కు సంబంధించి టాలీవుడ్ లో ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందనే విషయానికి వస్తే ఇందులో రెండే రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవి రంగస్థలం, మహానటి. ఇక అవార్డ్స్ లోకి వెళ్తే..!
ఉత్తమ నటుడు – రాంచరణ్ (రంగస్థలం)
ఉత్తమ నటి- కీర్తి సురశ్ (మహానటి)
ఉత్తమ సహాయ నటుడు- జగపతి బాబు(అరవింద సమేత)
ఉత్తమ సహాయ నటి- అనసూయ భరద్వాజ్ (రంగస్థలం)
ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ (మహానటి)
ఉత్తమ నటి (క్రిటిక్స్ అవార్డ్)- రష్మిక మందన్న (గీతా గోవిందం)
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవిశ్రీ ప్రసాద్ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్ (రంగస్థలం)
ఇలా ఫిలంఫేర్ అవార్డ్స్ లో మొత్తం వీరి హవానే నడించింది. కాని ఇంత మంచి సినిమా తీసిన రంగస్థల దర్శకుడు సుకుమార్ ను మాత్రం అవార్డు వరించకపోవడంతో రాంచరణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.