విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత రోజురోజికి పెరుగుతూ వస్తుంది. ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఆ ప్రాంత వాసులు చలికి గజగజ వణికిపోతున్నారు.ఇప్పుడే ఇలా ఉంటే జనవరిలో మరింత చలి పెరిగే అవకాసం ఉంది. ఏజెన్సీలోని మినుములూరులో, పాడేరు, లంబసింగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడివారు మధ్యాహ్నం అయిన ఇబ్బంది పడుతున్నారు. ఇక, అరకు, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
