టీడీపీ అధినేత చంద్రబాబుకు తనకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వస్తే ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్ర సమస్యగా వక్రీకరించడం వెన్నుపోటుతో పెట్టిన విద్య. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు విజయవాడకు వచ్చి హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత లేదంటూ, సెక్షన్ 8 అంటూ ఫోన్ ట్యాపింగ్ అంటూ రాద్ధాంతం చేయించాడు. కేవలం ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడం కోసం తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించాడు. తాజాగా మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కూడా ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై ఒక్క అమరావతి ప్రాంతంలో కొంత మంది బాబుగారి సామాజికవర్గానికి చెందిన రైతులు, టీడీపీ నేతలు తప్పా…మిగతా రాష్ట్రమంతటా స్వాగతించారు. ప్రస్తుతం అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలు కూడా టీడీపీ నేతలు దగ్గరుండి చేయిస్తున్నారన్న వాిదనలు వినిపిస్తున్నాయి. . మూడు రాజధానులు ఏర్పాటు అయితే అమరావతి ప్రాంతంలో వేల ఎకరాలు కొల్లగొట్టిన చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు, ప్రధానంగా బాబుగారి సామాజికవర్గానికి చెందిన వారి భూములకు విలువ పడిపోతుందన్న భయం నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోసారి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నాడు
రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు మిగతా రాష్ట్రంపై ప్రభావం చూపడం లేదని బాబు కలవరపడుతున్నాడు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యాపించేలా చేసేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాడు. టీడీపీ నేతలకు ఫోన్లు చేసి ఆందోళనలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య బయటపెట్టారు. రా ష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం వివాదాలు రేపడం చంద్రబాబుకు తొలి నుంచి ఉన్న అలవాటేనని ఆయన విమర్శించారు. రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న తరహాలోనే… రాష్ట్రం మొత్తం ఆందోళనలు చేయాల్సిందిగా ఫోన్లు చేసి మరీ చంద్రబాబు రెచ్చగొడుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. ఒక కృత్తిమ ఉద్యమాన్ని సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రాన్ని దక్షిణాఫిక్రాతో పోల్చడం ఏమిటి అని చెబుతున్న టీడీపీ నేతలు… మరి 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి ప్రపంచస్థాయి రాజధాని కడతానని చంద్రబాబు ఎందుకు చెప్పారో సమాధానం చెప్పాలన్నారు. వెనుకబడిన కరువు ప్రాంతాల నుంచి కూడా పన్నులు తీసుకెళ్లి అమరావతిలో లక్షల కోట్లు కుమ్మరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. టీవీల ముందుకు వచ్చి మాట్లాడుతున్న మేధావులు దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అమరావతిలో రాజధాని రైతుల ఆందోళన వెనుక టీడీపీ నేతల ప్రమేయం లేదని చెప్పగలరా అని రామచంద్రయ్య ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన లక్షల కోట్లు తీసుకెళ్లి అమరావతిలో కుమ్మరించి… సొంత మనుషులకు, బినామీలకు మంచి చేయాలని చంద్రబాబు కుట్ర చేశారన్నారు. రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని… ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని… అందుకు కొంత సమయం ఇవ్వాలని రామచంద్రయ్య కోరారు. మొత్తంగా రాజధాని పేరుతో మరోసారి రాష్ట్రమంతటా ఆందోళనలు చేయించి ఏపీని అగ్నిగుండంగా మార్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవును..రెచ్చగొట్టడం, విద్వేషాలు రగిలించడంలో బాబు తర్వాతే ఎవరైనా..కాదంటారా..