Home / ANDHRAPRADESH / మూడు రాజధానులపై చంద్రబాబు తీరును ఏకిపారేసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!

మూడు రాజధానులపై చంద్రబాబు తీరును ఏకిపారేసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఏపీ బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జీవీఎల్, పురంధేశ్వరీ వంటి నేతలు అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతు తెలుపగా, విష్ణువర్థన్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, సుజనా చౌదరి వంటి నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుపై ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని పొగుడుతున్నాను అనుకోకండి. నేను బీజేపీ అధ్యక్షుడు కాకపోయినా ఫర్వాలేదు.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబును మాత్రం వదలను’ అని సోము వీర్రాజు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు తెల్లవారుజామున లేచినప్పటి నుంచి రాజధాని కోసమే మాట్లాడుతారు..మరి అమరావతిలో కూడా హైదరాబాద్ లాంటి అభివృద్ధినే ఎందుకు చేయాలనుకుంటున్నారు..హైదరాబాద్ వల్లే కదా రాష్ట్ర విభజన ఇబ్బందులు వచ్చాయని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాయలసీమ రాష్ట్రంలో అంతర్భాగం.. రతనాల సీమగా మారాలని అన్నారు. రాష్ట్రంలో 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే చంద్రబాబు కనీసం ఒక్క పోర్టు కట్టాడా..? వైఎస్ రాజశేఖరరెడ్డిని పొగుడుతున్నాను అనుకోకండి. నేను బీజేపీ అధ్యక్షుడు కాకపోయినా ఫర్వాలేదు.. చంద్రబాబును మాత్రం వదలను అంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వానికి సోము వీర్రాజు పలు సూచనలు ఇచ్చారు. నిబద్దత కోసమే ఈ ప్రభుత్వానికి ప్రజలు 150 సీట్లు ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఏపీని 26 జిల్లాలుగా విభజిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలి. అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుంది’ అని సోమువీర్రాజు చెప్పుకొచ్చారు. వాస్తవానికి వైయస్ హయాంలో కృష్ణపట్నం పోర్టు పూర్తయింది. కాని బాబు హయాంలో ఒక్క పోర్టు కూడా పూర్తి కాలేదు..అయితే తన హయాంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందనుకుంటున్న చంద్రబాబుకు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. వైయస్‌ను పొగడను అంటూనే చంద్రబాబు మాత్రం వదలను అంటూ ఏకిపారేసారు. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చంద్రబాబును టార్గెట్ చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat