పోలీసులను కించపరుస్తూ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా కార్యకర్తల సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారని, ఓ కానిస్టేబుల్ టీడీపీ కార్యకర్తని వైసీపీలో చేరకపోతే బొక్కలో తోస్తానని వార్నింగ్ ఇచ్చాడని జేసీ ఆరోపించాడు. త్వరలోనే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన జేసీ…అధికారంలోకి రాగానే తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చిపెట్టుకుంటాం..అప్పుడు మీ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల జేబుల్లో గంజాయి పెట్టించి కేసుల్లో ఇరికిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కాగా బూట్లు నాకే పోలీసులను తెచ్చిపెట్టుకుంటామంటూ జేసీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్.. జేసీ దివాకర్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జెసీపై 153, 506 సెక్షన్ల కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే తాజాగా పోలీసులపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. .ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పించే పోలీసులను కించపరచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నాడు పోలీసుగా ఉన్న తాను స్పందించి మీసం మెలేస్తే తనను ప్రజలు పార్లమెంట్‌కు పంపించారని…అదే జేసీని బజారుకు ఈడ్చారని మాధవ్ ఎద్దేవా చేశారు. పోలీసులను కించపరుస్తుంటే మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు మందలించకపోగా నవ్వుతూ కూర్చోవడం బాగాలేదని…40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు నిజస్వరూపం ఇదేనా అని ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డి పనైపోయిందని, ఎన్నికల్లో పోటీ చేయకుండా కుమారులను దింపి కూడా ప్రయోగం చేసినా ప్రజలు అంగీకరించలేదన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను చంద్రబాబు, జేసీ దివాకర్ రెడ్డి గుర్తించుకోవాలన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ పోలీసుల బూట్లను శుభ్రం చేసి… వాటిని ముద్దాడారు. గతంలో మీసం మెలేసీ జేసీకి పోలీసుల పౌరుషం చూపించిన గోరంట్ల మాధవ్..ఈ సారి పోలీస్ బూటును ముద్దాడి…పోలీసుల గొప్పతనం ఏంటో నిరూపించారు. హ్యాట్సాఫ్ ఎంపీ మాధవ్..!
