తెలంగాణ రాష్ట్ర బంగారు గని సింగరేణి మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఇప్పటికే రెండు యూనిట్ల ద్వారా పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది సింగరేణి సంస్థ.
తాజాగా జైపూర్ లో మూడో యూనిట్ కు పచ్చజెండా ఊపింది. దీంతో మూడో యూనిట్ గా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది.
అందుబాటులో ఉన్న 127.31హెక్టార్ల స్థలంలో రూ.5,879.62కోట్లతో మూడు యూనిట్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సింగరేణి సన్నద్ధమవుతుంది.