ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొంది. జన నేత జన్మదినోత్సవ వేడుకలను వైసీపీ శ్రేణులు ఊరూరా, వాడవాడలా అంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు జననేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రులు, అధికారులు ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వైయస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయిస్తున్న అధికారులు, మంత్రులు. బాలినేని, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ముఖ్యనేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జననేత జగన్ ఇలాగే నూరేళ్లు ఆయురారోగ్యాలతో, రాష్ట్రాన్ని కలకాలం పాలించాలని మంత్రులు, నేతలు కోరుకున్నారు.