తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలుకు సరికొత్త రంగులను సంతరించుకోనున్నది. బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్ గా నిలిచిన సింగరేణి ప్రకటనలు రైలు బోగీలపై కన్పించనున్నాయి.
కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే అల్విన్,జనరల్ మేనేజర్ ఆంటోనిరాజా ,రైల్వే అధికారులు నిన్న శుక్రవారం ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు వీడ్కోలు పలికారు.
ప్రకటనల విభాగంలో కొత్త అవకాశాలను సృష్టించుకోవాలన్న దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య ఆలోచనల నేపథ్యంలో సింగరేణి సంస్థ మొట్టమొదటి సారిగా ఈ తరహా ప్రకటనలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.పర్యావరణానికి హాని కలుగకుండా,భద్రత,రక్షణ ,పరిశుభ్రతలో ఇబ్బందులు రాకుండా ప్రకటనలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.