ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం.
ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము
ఫిబ్రవరి 15న పాకిస్థాన్ దేశానికి అత్యంత ప్రాధాన్య దేశ హోదాను భారత్ ఉపసంహరించుకుంది
ఫిబ్రవరి 19న డీజిల్ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్ గా మార్చిన మొట్ట మొదటి రైలును ప్రధానమంత్రి నరేందర్ మోదీ వారణాసిలో ప్రారంభించారు
ఫిబ్రవరి26న బాలాకోట్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ వైమానిక దళం దాడి చేసింది
ఫిబ్రవరి 28న ఐదు వందలకు పైగా బస్సులతో అతిపెద్ద వాహన శ్రేణిని ఏర్పాటు చేసి యూపీ ఆర్టీసీ గిన్నిస్ రికార్డులకెక్కింది