తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మరియు మున్సిపల్ ,ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి ఉదారతను ప్రదర్శించారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మాజీ ఎంపీపీ గంగసాయవ్వ చికిత్సకు మంత్రి కేటీ రామారావు చేయూతనిచ్చారు.వారం రోజుల కిందట గంగసాయవ్వ కాలికి గాయమైంది.
స్థానిక ఆసుపత్రిలో చూపించుకోగా.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రికి రెఫరల్ చేశారు. దీంతో ఆమె హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది అని వైద్యులు తెలపడంతో స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు వివరించారు.
వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ రూ.2లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు. శస్త్రచికిత్సల అనంతరం మంత్రి కేటీఆర్ స్వయంగా ఆసుపత్రికెళ్లి గంగసాయవ్వను పరామర్శించారు. ఆరోగ్యం గురించి వైద్యులను ,ఆమెను అడిగి తెలుసుకున్నారు. గాయం నయమయ్యే వరకు వైద్యం అందించాలని మంత్రి కేటీఆర్ వైద్యులకు సూచించారు.