సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రష్మిక మందన్న హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్ నడుస్తుంది. అదేమిటంటే మహేష్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ వస్తున్నాడు అనే వార్త. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తన కుటుంబీకులు రావడం చూసాం కాని అప్పుడు భరత్ అనే నెఉ చిత్రానికి ఎన్టీఆర్ రాగా ఇప్పుడు దీనికి మెగాస్టార్ రావడం అంటే మోమోలు విషయం కాదని చెప్పాలి. అనిల్, దిల్ రాజు ఇంటికి వెళ్లి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. మరోపక్క మహేష్ కూడా కాల్ చేసి ఆహ్వానించారట. అయితే వీరిద్దరి మధ్య సినిమా పరంగా ఎప్పుడూ కలవకపోయినా ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్స్ లో కలుస్తారు. అంతేకాకుండా మహేష్ టాలీవుడ్ నెం.1 ఎప్పటికీ చిరంజీవి గారే అని అన్నారు. అయితే చిరు తన మేనల్లుడు అల్లు అర్జున్ సినిమా ఈవెంట్ అదేరోజున జరుగుతున్నా అక్కడికి వెళ్ళకుండా మహేష్ దగ్గరకి రావడంపట్ల మెగా ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అయితే ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు పిలిచారు కాబట్టే వెళ్తున్నారని తెలుస్తుంది.