ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది ఆయన మొట్టమొదటి పుట్టినరోజు కావడంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జగన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలు సంబరాలు జరుపుకుంటున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమారుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన జగన్ తండ్రి మరణంతో ఒంటరి వాడైన వైనం అందరికీ తెలిసినదే. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి 2009లోవైఎస్ఆర్సిపి పార్టీని ప్రారంభించి 2014లో ఎన్నికలలో పోటీ చేసి ప్రతిపక్ష నేతగా ఎదిగాడు 2019 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టనష్టాలను తెలుసుకుని తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న సంకల్పంతో రాజన్న రాజ్యన్ని నిర్మించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్న ఏపీ సీఎం జగన్ ఈరోజు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
జగన్ తండ్రి మరణంతో నిరాశ్రయులైన అభిమానులను ఓదార్చే ఉద్దేశంతో ఓదార్పు యాత్ర చేశారు. ఆత్మస్థైర్యం, తో తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న సంకల్పంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం కోట్లాది ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపమైంది. అందరూ బాగుండాలని, ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని నిండైన మనసుతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న జననేతకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ కొందరు పోస్టులు పెట్టారు. రాజన్న అకాల మరణంతో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని ప్రతిపక్షాల అవినీతి కోరల్లో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమంతో మరోవైపు అభివృద్ధితో సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళుతున్న సమర్థవంతమైన నాయకులు జగన్ అంటూ కొందరు తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ప్రత్యర్థుల ఎత్తులను చిత్తుచేసే చాణక్యుడు, ప్రజారంజక పరిపాలన అందించే చంద్రగుప్తుడు, చిక్కుముడులను విప్పే ట్రబుల్ షూటర్, గుణగణాలలో సుగుణాభిరాముడు. నిండు నూరేళ్లూ అద్భుత విజయాలు, ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ.. ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి శుభాకాంక్షలు అంటూ మరికొందరు. జగన్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వెబ్సైట్లలో అభిమానులు కార్యకర్తలు తమ అభిమాన నాయకుడినికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.