ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన లేని లోటును ప్రజలకు అందించి వారిని అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందడుగు వేసి 1 ఎంపీ, 1 ఎమ్మెల్యేతో మొదలై ఆ తరువాత 67 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగాడు.ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూనే ప్రజలకు తోడునీడలా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రజల పక్షాన నిలబడి అధికార పార్టీని ప్రశ్నించి ప్రజల కష్టాలను తెలియపరిచేవారు. అధికారంలో ఉన్నవారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ధైర్యంగా నిలబడి, వారిని ఎదురుకున్న ఏకైన నాయకుడు జగన్ అని చెప్పాలి. తండ్రి బాటలోనే నడుస్తూ ఆయన ఆచరనలతో ముందుకు సాగారు. దీనికి ముఖ్య ఉదాహరణ ప్రజాసంకల్ప యాత్ర అని చెప్పాలి. ఈ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ప్రతీ ఊరు, ప్రతీ గడప, ప్రతీఒక్కరి దగ్గరకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని నేనున్నానంటూ హామీ ఇచ్చారు.
అందరి సమస్యలను తెలుసుకొని చలించిపోయారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రతీఒక్కరిని సమానులుగా భావించి అందరికి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. నిరుద్యోగుల కళ్ళలో వెలుగులను నింపుతానని మాట ఇచ్చారు. జగన్ ను నమ్మిన యావత్ ప్రజానీకం అఖండ మెజారిటీతో గెలిపించారు. యువనేత నుండి జననేతగా ఎదిగి 86% సీట్లతో, 50% ఓట్లతో దిగ్విజయంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. అనంతరం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి అలుపెరగని యోధుడిలా రాష్ట్రం కోసం, ప్రజలకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.ఈ ఆరు నెలల పాలనలో జగన్ చేసిన పనులు పెట్టిన పథకాలతో అందరు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.6నెలల పాలనతో అందరివాడిగా కీర్తింపబడుతున్న పీపుల్స్ సీఎం జగన్ కు దరువు వెబ్ మీడియా తరుపున జన్మదిన శుభాకాంక్షలు.