దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కర్పొరేషన్ చైర్మెన్ కె.దామోదర్ గుప్తా అన్నారు. జనగామ జిల్లా ఎసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖలో అధునాతన భవనాలు, అధునాతన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పోలీసు శాఖకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో పోలీసు భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. రెండవ విడుతలో 500 కోట్ల రూపాయలతో అత్యాధునిక వాహనాలను పోలీసు శాఖకు కేటాయించడం జరిగిందిఅని అన్నారు.