అంజలి ఒకప్పుడు చిన్న సినిమా.. పెద్ద సినిమా అని చూడకుండా వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయిన తెలుగు అమ్మాయి. ఆ తర్వాత సినిమాలు హిట్లు అవ్వడం.. వరుస అవకాశాలు రావడం ఏమో కానీ అమ్మడుకు కాస్త తలకెక్కింది గర్వం.
అంతే తనతో రెండు మూడు సినిమాల్లో నటించిన కోలీవుడ్ హీరో జై తో ప్రేమలో పడ్డారు. పీకల్లోతు మునిగిన ఈ జంట పెళ్ళి కూడా చేసుకున్నారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఈ జంట కూడా తెగ తిరిగాయి కూడా.
అయితే తాజాగా ఈ జంట మాది ప్రేమ కాదు .. మా మధ్య ఉన్నది కేవల స్నేహాం మాత్రమే. మేము ఎప్పటికి స్నేహితులమే తప్పా ప్రేమికులం కాదు. మాకు పెళ్లి అయినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. మాకు సినిమాల్లో అవకాశాల్లేక కలిసి నటించడం లేదు. అయిన ప్రేమికుల మధ్య బ్రేకప్ ఉంటుంది కానీ స్నేహితుల మధ్య బ్రేకప్ ఉంటుందా అని వీళ్లు అభిమానుల చెవిలో తెగ పూవ్వులు పెడుతున్నారని వాళ్ల కామెంట్లపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.