యశస్వి జైస్వాల్.. ఈ మధ్య కాలంలో ఈ పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీ తాను చేసిన డబుల్ సెంచరీ నే దీనికి కారణం అని చెప్పాలి. అంతేకాకుండా ఓపెనర్ గా జట్టుని ముందుండి నడిపించాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ యువ ఆటగాడు లైఫ్ స్టైల్ విషయానికి వస్తే అతడు పానిపురి బండి అమ్ముకునేవాడట. చిన్నప్పటినుండి పట్టుదలతో క్రికెట్ పై దృష్టి సారించడంతో ఈరోజు అతడిపేరు అందరినోట వినిపిస్తుంది. అయితే గురువారం నాడు ఐపీఎల్ ఆక్షన్ లో భాగంగా అతడిని రాజస్తాన్ రాయల్స్ 2 కోట్ల 40 లక్షలకు కొనుక్కుంది. 20లక్షలతో మొదలై ఈ యువ క్రికెటర్ అంత రేట్ పలకడం అంటే మామోలు విషయం కాదు.
