రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు శుక్రవారం శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చేరుకున్నారు.
నగరంలోని బేగంపేటలో విమానశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర సీఎస్ తో సహా సంబంధిత అధికారులు ,మంత్రులు,పార్టీ నేతలు హజరై రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
ఈ రోజు శుక్రవారం నుండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రాష్ట్రపతి దక్షిణాదిలో పర్యటించనున్నారు. ఆయన రాకతో బొల్లారం లో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.