అశ్లీల వీడియోలను అదే పనిగా వీక్షించే వారిలో మహిళలు కూడా ఉన్నట్టుగా వెలువడ్డ సమాచారం సర్వత్రా విస్మయానికి గురిచేస్తున్నాయి. చెన్నైలో 30 మందిని గుర్తించి ఉన్నట్టు ఏకంగా ఏడీజీపీ రవి ప్రకటించారు. ఇలాంటి వీడియోలను వీక్షించ వద్దు అని యువతులు, మహిళలకు పిలుపునిచ్చారు. పోర్న్ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్లో అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వేలో తేలి ఉన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలకు తగ్గట్టుగానే, ఇటీవల కాలంగా మహిళలు, యువతులు, పిల్లలపై లైంగిక దాడులు, ఉన్మాద చర్యలు పెరిగి ఉన్నాయి. దీంతో మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించే రీతిలో దూకుడు పెంచి ఉన్న పోలీసుల యంత్రాంగం అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే రీతిలో చర్యలు చేపట్టారు. చిన్న పిల్లల్ని, మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసిన వీడియోలే కాదు. అశ్లీల సైట్స్ల్లో గంటల కొద్ది గడిపే వారిని గురి పెట్టి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడు పెంచే పనిలో పడ్డారు. రాష్ట్రంలో మూడు వేల మంది అదే పనిగా పోర్న్ వీడియోల్ని వీక్షిస్తూ, గంటల కొద్ది ఆన్లైన్లో గడుపుతున్నట్టుగా తేలింది. ఇందులో మహిళలు కూడా ఉన్నట్టు ప్రస్తుతం సంకేతాలు వెలువడ్డాయి. వీరు చెన్నైలో ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా ఏడీజీపీ రవి పేర్కొనడం సర్వత్రా విస్మయానికి గురి చేసింది.