40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అనుకున్నది చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు అనడంలో సందేహమే లేదు. దానికి ముఖ్య ఉదాహరణ 2014 ఎన్నికలే. అప్పటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వారికి ఒక ఆశను కల్పించి, చివరికి గెలిచాక అందరికి చుక్కలు చూపించారు చంద్రబాబు. అదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మరో తేడా చూపించారు వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి. “కడప స్టీల్ ప్లాంటు విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరుగా నిల్చారు. ఇనుప ఖనిజం సరఫరా హామీ లేకుండానే ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా NMDC తో ఏటా 50 లక్షల టన్నుల ఖనిజం సరఫరాకు ఎంఓయూ కుదుర్చుకుంది. జగన్ కి, మోసకారి బాబుకు తేడా ఇదే.