ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ నే అభివృద్ధి చేయడం వలన మిగతా ప్ర్తాంతాలను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే ఈ సమస్య రావద్దు అనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.
గతంలో రాజధాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలను తిరిగి రైతులకు ఇస్తాము. రాజధాని భూములను తిరిగి ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించారు.
ప్రస్తుతం రాజధానిని తరలించవద్దు అని టీడీపీకి చెందిన నేతలు,కార్యకర్తలు,బాబు తరలించిన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే ధర్నాలు చేస్తున్నారు..తుళ్లూరు లో తక్కువ ధరలకు తెలుగుదేశం నేతలు భూములు కాజేశారు” అని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అమరావతిలోని లెజిస్లేటివ్ క్యాపిటల్ కు 300 ఎకరాలు సరిపోతుంది అని అన్నారు.