పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత కొన్నిరోజుగా దేశమంతట ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. వారిని నిలువరించేందుకు ఓ పోలీస్ అధికారి చేసిన ప్రయత్నం ఇప్పుడు యావత్ దేశానికి తాకింది. దేశభక్తిని అందరిలో నింపి నిరసనలను కట్టడి చేసాడు. ఇంతకు ఆ పోలీస్ ఏం చేసాడు అనే విషయానికి వస్తే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో దేశమంతా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఇందులో భాగంగా బెంగళురులో గురువారం నాడు నిరసనలు జరగగా వాటిని ఆపేందుకు వచ్చిన డీసీపీ చేతన్ సింగ్ ఎంత చెప్పినా వారు వినకపోవడంతో ఒక్కసారిగా జాతీయగీతం ఆలపించారు. దాంతో అక్కడ ఉన్నవారు అంతా కూడా ఆయనతో పాటుగా పడుతూ చివరకు ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోవడంతో అక్కడ ప్రశాంతత వాతావరణం సంతరించుకుంది.
