గత ఐదేళ్ళ పాలనాలో చంద్రబాబు హయంలో రాజధాని ఎక్కడ ఉండాలి అని కేంద్రం నియమించిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీలో ఇండియాలో పేరు ప్రఖ్యాతులున్న భవన రంగ నిపుణులు ,ఆర్ధిక నిపుణులు ఉన్నారు. వారి ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో అన్ని తప్పులే ఉన్నాయి. ఆ నివేదికను పక్కన పెట్టి తన కులస్తులకు, సొంతవారికి ముందుగానే సమాచారం ఇవ్వడంతో వారు రాజధాని రైతుల దగ్గర దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. “అమరావతిలో రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టు, ఇంకా ఏదయినా ప్రకటనకు ముందే తన వాళ్లకు సమాచారం ఇచ్చి ఇన్ సైడర్ ట్రేడింగుకు పాల్పడ్డారు చంద్రబాబు. అది ఆయన పేటెంట్. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని రావడం ఇష్టం లేని దత్తపుత్రుడు, పచ్చపార్టీ నేతలు వైసీపీపై నిందలు వేస్తున్నారు” అని అన్నారు.
